లాక్‌డౌన్ నుంచి సడలింపు లభించటంతో దేశంలో అతిపెద్ద కార్ల ఉత్పత్తి సంస్థ మారుతీ సుజుకీ హర్యానాలోని మానేసర్ ప్లాంట్‌లో ఉత్పత్తి ప్రారంభించేందుకు ప్రభుత్వం బుధవారం అనుమతిచ్చింది. రోజుకు ఒకటే షిప్టులో మాత్రమే కార్యకలాపాలు నిర్వహించాలని గురుగ్రామ్ జిల్లా అధికారులు షరతు పెట్టారు. అయితే కంపెనీ మాత్రం నిరాటంకంగా ఉత్పత్తి నడిచే పరిస్థితి ఏర్పడినప్పుడు మాత్రమే కార్యకలాపాలు ప్రారంభిస్తామని తెలిపింది. ప్రస్తుతం కార్ల విక్రయాలు కూడా లేనందున వెంటనే ఉత్పత్తి ప్రారంభం కాదని వివరణ ఇచ్చింది.
మనేసర్లో మారుతీ ఉత్పత్తికి అనుమతి