స్విగ్గీలో వెయ్యి ఉద్యోగాల‌ కోత‌!


ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ వ‌చ్చే నెలలో 1000 మంది ఉద్యోగులను విధుల్లో నుంచి తొలగించనుంది. కాస్ట్ కటింగ్ ప్లాన్ లో భాగంగా బోర్డు ప్రతిపాదించిన నిర్ణయాన్ని కంపెనీ ఆమెదించింది. ఫలితంగా వందల కొద్దీ స్టార్టప్ రెస్టారెంట్లపైనా ఈ ప్రభావం కనిపించనుంది. బెంగళూరుకు చెందిన స్విగ్గీ సగానికి పైగా ప్రొడక్షన్ ను షట్ డౌన్ చేసేసింది. ఆ కిచెన్లకు చెల్లించాల్సిన అద్దెలో సైతం సగానికి పైగా కోత విధించింది. స్విగ్గీ ముందుగా ఫిబ్రవరి-మార్చి నెలలోనే ఉద్యోగులను తొలగించాలనుకుంది ఆ నిర్ణయం వెనక్కు తీసుకున్నా ఇప్పడు తప్పడం లేదు. సోమవారం పేటీఎం 700 మంది ఉద్యోగులను తొలగించింది.