ఎవరెవరి వేతనాల్లో ఎంత కోత.. జీఓ ఇచ్చిన ప్రభుత్వం

 కరోనా వైరస్‌ వ్యాప్తి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నది. అటు ఆదాయం పడి పోవడం.. ఇటు కరోనా వ్యాధి నివారణ, సహాయ చర్యలకు భారీ ఎత్తున ఖర్చు చేయాల్సి రావడం       ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి మొదలుకొని అందరు ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు, ఇతర ఉద్యోగులకు ఈ  నెల   చెల్లించాల్సిన (మార్చి నెల) వేతనాల్లో కొంత మొత్తాన్ని వాయిదా వేయాలని ప్రభుత్వ నిర్ణయించింది. ఇలా వాయిదా వేసిన మొత్తాన్ని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడిన తర్వాత తిరిగి చెల్లిస్తారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. సోమవారం ప్రగతిభవన్‌లో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సమగ్రంగా సమీక్ష జరిగింది.  దీనికి సంబంధించిన జీఓ సోమవారం ప్రభుత్వం విడుదల చేసింది.