కరోనా మహమ్మారి కారణంగా జనం ఇండ్లకే పరిమితమై ఉపాధి లేక అల్లాడుతున్న వేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లాకు చెందిన ఓ రైతు దాతృత్వాన్ని చాటుకున్నాడు. గోరంట్ల మండలం రాగి మేకలపల్లి గ్రామానికి చెందిన రైతు గంగాధర్ రెడ్డి తన పొలంలో పండిన పొప్పడి పండ్లను ఒక ట్రాక్టర్ నిండా తీసుకొచ్చి గోరంట్ల మార్కెట్ యార్డులో ఉచితంగా పంచిపెట్టాడు. లాక్‌డౌన్ నిబంధనల మేరకు ప్రజలు సామాజిక దూరం పాటించేలా చూస్తూ పొప్పడి పండ్లు దానం చేశాడు. ఈ సందర్భంగా గంగాధర్‌రెడ్డి మాట్లాడుతూ... ఈ కష్ట సమయంలో ప్రజలకు తనవంతు సాయం అందించడం సంతోషంగా ఉందన్నారు. కాగా, పండ్ల పంపిణీలో రైతు గంగాధర్ రెడ్డికి రాగి మేకలపల్లి గ్రామానికి చెందిన మరికొందరు కూడా సాయపడ్డారు.